విదర్భ జట్టుకు గుడ్ బై చెప్పిన టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
భారత క్రికెట్ జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ తన సుదీర్ఘ డొమెస్టిక్ కెరీర్లో కీలక నిర్ణయం తీసుకుంటూ విదర్భ జట్టును వీడారు. సెలెక్టర్లతో కమ్యూనికేషన్ గ్యాప్ మరియు భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి కారణంగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆదివారమే ఆయన అధికారికంగా నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందారు. ప్రస్తుతం మరో రెండు మూడు రాష్ట్రాల అసోసియేషన్లతో చర్చిస్తున్న ఉమేష్, త్వరలోనే తన కొత్త డొమెస్టిక్ జట్టును ప్రకటించనున్నారు.