పెరిగిన ఇంధన ధరలతో త్వరలో భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఇండియా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో పెట్కోక్, బొగ్గు దిగుమతి వ్యయం ఇరవై శాతం వరకు పెరిగింది. దీనివల్ల సిమెంట్ తయారీ కంపెనీలపై భారం పడి, ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతోందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. ఈ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు కంపెనీలు సిద్ధమవుతుండటంతో, రాబోయే రోజుల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.