పోలీస్ అమరుల స్మరణలో నగరంలో మెగా రక్తదాన శిబిరాలు ప్రారంభం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నగర కమిషనరేట్ పరిధిలోని ముప్పై ఎనిమిది కేంద్రాల్లో మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించినట్లు Hyderabad City Police వెల్లడించారు. సీఏఆర్ హెడ్క్వార్టర్స్లో ఈ రక్తదాన మహోద్యమాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల మహోన్నత త్యాగాలకు నివాళిగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొంటూ ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్ పిలుపునిచ్చారు.