విద్యార్థుల్లోని జ్ఞాన తృష్ణను వెలికితీసిన క్విజ్ సమరం
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం లోని SVN లేక్ ప్యాలెస్ వేదికగా రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవ కార్యక్రమాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేకంగా క్విజ్ పోటీలు ఏర్పాటు చేసినట్లు నవతారోత్సవ చైర్మన్ ముకేశ్ మారుతీరాజ్ తెలిపారు. పిల్లలలో దాగి ఉన్న చైతన్యం, క్రియాశీలత మరియు సృజనాత్మక ప్రతిభను బయటకు తీయడమే రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశమని ప్రెసిడెంట్ జగదీష్ పేర్కొన్నారు. ఈ విజ్ఞాన సాధన కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు చందు, మనోజ్, నటరాజ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొని చిన్నారులను ఎంతగానో అభినందించి ఉత్సాహపరిచారు.