రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహణపై యూజీసీ కీలక ఆదేశాలు జారీ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

సర్థార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు రాష్ట్రీయ ఏక్తా దివస్ను ఘనంగా నిర్వహించాలని యూజీసీ ఇండియా కోరారు. జాతీయ ఐక్యత మరియు సమగ్రతకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని విద్యా సంస్థల నిర్వాహకులకు వర్సిటీల గ్రాంట్స్ కమిషన్ ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.