ఇరాన్ నౌకపై దాడి: డొనాల్డ్ ట్రంప్ మౌనం!
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
ఖెష్మ్ ద్వీపం సమీపంలో ఇరాన్ కార్గో నౌకపై జరిగిన భీకర దాడిలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై అమెరికా ప్రమేయం ఉందా అన్న ప్రశ్నకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టత ఇవ్వడానికి నిరాకరించారు. ఈ పరిణామంతో హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరగా, ఒమన్‌లో జరగాల్సిన దౌత్య చర్చలు వాయిదా పడ్డాయి.