మచిలీపట్నంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పత్రాలు అందజేసిన మంత్రి కొల్లు రవీంద్ర

రిపోర్టర్: వెంకట్ స్థలం: కృష్ణా

మచిలీపట్నం నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. స్థానిక ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్వయంగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల గృహనిర్మాణ స్వప్నాన్ని సాకారం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయని వెల్లడించారు.