మూడు గ్రామాలకు సిగ్నల్‌ కష్టాలు!

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్:మందోళ్లగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సింగరాయచెరువు, మందోళ్లగూడెం, తూర్పుగూడెం గ్రామాల్లో మొబైల్‌ సిగ్నల్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ తంగేళ్ల వెంకటేష్‌ ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలోని రిలయన్స్‌ నెట్‌వర్క్‌ కార్యాలయ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయా గ్రామాల్లో సిగ్నల్‌ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, టవర్‌ ఏర్పాటు చేసి మెరుగైన సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ డా. సుర్కంటి శ్రీధర్‌రెడ్డి, వార్డు సభ్యుడు నెట్టు అంజయ్య, మాజీ వార్డు సభ్యుడు సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు పైళ్ల బాల్‌రెడ్డి పాల్గొన్నారు.