దేశవ్యాప్తంగా వైభవంగా గణేశ్ చతుర్థి వేడుకలు ప్రారంభం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మహారాష్ట్ర

దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం భక్తులు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ముంబైలో లాల్‌బాగ్‌చಾ రాజా దర్శనాలు మొదలయ్యాయి. అయితే ఆరు అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను కృత్రిమ చెరువుల్లోనే నిమజ్జనం చేయాలని అధికారులు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు.