పెదబయలులో భూ యాజమాన్య పట్టాల పంపిణీ.. హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
పెదబయలు మండలం పెదకోడపల్లి పంచాయతీలో 'మీ భూమి–మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా భూ యాజమాన్య పట్టాలు, పాస్‌బుక్‌లను అధికారులు పంపిణీ చేశారు. మెరకచింత, వాకపల్లి గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే అధికారులు లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో తమ భూములకు శాశ్వత హక్కులు లభించాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పి. నాగేష్, మాజీ ఎంపీటీసీ సింహాచలం, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.