ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మద్దతు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఆదిలాబాద్
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవట్లేదని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ వైద్యవిభాగం పరిధిలో తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారంతో పదహారు రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై రాష్ట్ర స్థాయిలో తీవ్ర ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.