తెలంగాణ నీటి హక్కులను కాలరాసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
తెలంగాణ నీటి హక్కులను కాలరాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నాటి ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కై రాయలసీమ ప్రాజెక్టుకు కేసీఆర్ సహకరించారని ధ్వజమెత్తారు. ఈ స్వార్థ రాజకీయ పాపం వల్లే తెలంగాణ కృష్ణా జలాల్లో వాటాను కోల్పోయిందని, దక్షిణ తెలంగాణ జిల్లాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని మండిపడ్డారు.