తాత కేసీఆర్ తో కలిసి గణేష్ పూజలో హిమాన్షు
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులతో కలిసి వారి మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షురావు గణపయ్యకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత వైరల్ గా మారాయి.