గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టిన కబడ్డీ క్రీడాకారుడు

రిపోర్టర్: హరి స్థలం: Haryana

హరియాణాలోని గురుగ్రామ్‌లో గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై మహిళా బైకర్‌ను కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడు అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు కల్యాణ్ బైంస్లా. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.