మోదీ జీవిత చరిత్రను నాటక రూపంలో ప్రదర్శించనున్న బీజేపీ తెలంగాణ

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

భారతదేశాన్ని వికసిత భారతదేశంగా మార్చే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ తెలంగాణ పేర్కొంది. మోదీ జీవిత చరిత్ర మరియు సేవా కార్యక్రమాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో నాటక రూపంలో ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే స్థాయి నుంచి ఆయన ఎదిగిన వైనాన్ని ఈ ప్రదర్శనల ద్వారా ప్రజలకు చేరవేయనున్నారు.