జైపూర్‌లో పోటీ పరీక్షల విద్యార్థి ఆత్మహత్య

రిపోర్టర్: గోపి స్థలం: రాజస్థాన్

జైపూర్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 22 ఏళ్ల రాకేష్ అనే విద్యార్థి హోటల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోయానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తర్వాత ఈ విషాదం చోటుచేసుకుంది. బంధువులు వచ్చి చూసేసరికి అతడు విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.