మహిళా కండక్టర్ ప్రవళిక మృతి: ఆర్టీసీ కార్మికుల భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన

రిపోర్టర్: కిరణ్ స్థలం: సూర్యాపేట

మణుగూరు డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తూ ప్రయాణికుల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ప్రవళిక ఘటనపై స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు బత్తుల సుధాకర్, సుంకరి శ్రీనివాస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని, విధి నిర్వహణలో మహిళా ఉద్యోగులకు పూర్తిభద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సూర్యాపేట ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.