సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో అధికారుల సర్వేపై రైతుల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సురేష్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవల్లిలో తమ భూముల్లో రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేస్తుండటాన్ని గ్రామస్తులు, దళిత రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల భూమిని లాక్కొని వేరేవాళ్లకు ఇస్తే ఎలా బతకాలంటూ ఏడీ సుదర్శన్ రాథోడ్ ఆధ్వర్యంలో వచ్చిన అధికారులను నిలదీశారు. రాళ్లు, రప్పలతో ఉన్న బీడు భూములను గతంలో కేసీఆర్ చొరవతో సాగులోకి తెచ్చుకున్నామని, ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు.