తుపాను బీభత్సం: బాపట్ల జిల్లాలో సముద్రంలో గల్లంతైన ఐదుగురు మత్స్యకారులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: బాపట్ల
తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు. చీరాల మండలం వాడరేవుకు చెందిన ఎర్రిపల్లి రమణ, కోదండ, సూరాని పోల్ రాజ్, జగ్గారావు, అప్పారావు ఒకే బోటులో సముద్రంలోకి వెళ్లగా వాతావరణం మారి గల్లంతయ్యారు. కుండపోత వర్షాలకు చీరాల పట్టణం నీటమునిగిందని, కోస్ట్ గార్డ్ సహకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని యంత్రాగం పేర్కొంది.