అన్యాయం చేసే పోలీసులను డిజిటల్ బుక్‌లో ఎక్కించాలన్న జగన్

రిపోర్టర్: రాము స్థలం: Andhra Pradesh

జగన్ 2.ఓ పాలనలో కార్యకర్తలే నంబర్ వన్ అని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్న పోలీసుల వివరాలను డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని పిలుపునిచ్చారు. తప్పు చేసిన పోలీసులకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.