దిగ్గజ గాయని ఆశా భోస్లే చివరి పాట విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

దిగ్గజ గాయని ఆశా భోస్లే 93వ పుట్టినరోజు సందర్భంగా ఆమె చివరి సినిమా పాట 'ఏ మేరీ జిందగీ' విడుదలైంది. 'ఓమ్ కా హరి' సినిమా కోసం ఆమె ఈ పాటను ఆలపించారు. ఈ ఏడాది ఏప్రిల్లో కన్నుమూసిన ఆమె మధుర గళం నుంచి వచ్చిన ఆఖరి పాట కావడంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. స్టూడియోలో ఆమె పాడుతున్న అరుదైన దృశ్యాలతో ఈ వీడియోను రూపొందించారు.