బెల్లంపల్లి రెండవ వార్డు గణనాథుడి కిమున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్ ప్రత్యేక పూజలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులో కొలువుదీరిన వినాయక మండపంలో గణనాథుడికి మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విఘ్నేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అలాగే పెద్ద సంఖ్యలో బస్తీ ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు.