జాల గ్రామంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మైసమ్మ ఫౌండేషన్
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం జాల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బరిగే మైసమ్మ కుటుంబానికి మేమున్నాం జాల మైసమ్మ ఫౌండేషన్ సభ్యులు మంగళవారం పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ నవనీత నరసింహులు, ఉపసర్పంచ్ లావణ్య కరుణాకర్, గ్రామ పెద్దలు మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.