ఉద్యోగులకు తీపి కబురు: రెండు రోజుల పాటు ప్రత్యేక సెలవులు మంజూరు
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉద్యోగులకు ఈనెల నాలుగో తేదీతో పాటు ఐదో తేదీన కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే వెల్లడించారు. ఎన్నికల ఏర్పాట్లు మరియు పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.