రాష్ట్రంలో పురపోరుకు సర్వం సిద్ధం: రేపు 92 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో ఎనిమిది పురపాలక సంఘాల్లో ఛైర్పర్సన్ సహా కౌన్సిలర్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఆదివారం 92 పట్టణ స్థానిక సంస్థలకే పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. మొత్తం 2,382 స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో 6,669 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు 99.36 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు 11,705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం పేర్కొంది.