ఘనంగా సూర్య, జ్యోతికల ఇరవయ్యవ వివాహ వార్షికోత్సవ వేడుక

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

కోలీవుడ్ ప్రముఖ నటులు సూర్య, జ్యోతిక దంపతులు తమ వివాహం జరిగి ఇరవై ఏళ్లు పూర్తి కావడంతో మరోసారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పిల్లలు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇరవై ఏళ్ల ప్రేమ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ అరుదైన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, సెలబ్రిటీలు, అభిమానులు ఈ క్యూట్ జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.