డిజిటల్ పరధ్యానం తీవ్ర ముప్పు: మానసిక అలసటపై డాక్టర్ అరవింద్ బాడిగర్ హెచ్చరిక

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

నిత్య జీవితంలో డిజిటల్ పరధ్యానం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోందని బిడిఆర్ ఫార్మాస్యూటికల్స్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ బాడిగర్ స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం, నిరంతర నోటిఫికేషన్లతో ఏకాగ్రత దెబ్బతింటుందని తెలిపారు. దీనివల్ల మానసిక అలసట పెరిగి, ఉత్పాదకత తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవాలని, ఒకే సమయంలో ఒకే పనిపై దృష్టి పెట్టడం ద్వారా మెదడును తిరిగి ఉత్తేజితం చేసుకోవచ్చని ఆయన సూచించారు.