రూ.16 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణానికి భూమిపూజ

రిపోర్టర్: అశోక్ స్థలం: పార్వతీపురం మన్యం

గిరిజన గ్రామాల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని సంధ్య రాణి పార్వతీపురం వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో మాకవరపాలెం మండలం చిట్టిపాలెంలో రూ.16 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్ యూనిట్కు స్పీకర్ అయ్యన్నపాత్రుడితో కలిసి భూమిపూజ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ద్వారా గిరిజన ప్రాంతాల్లోని కాఫీ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె స్పష్టం చేశారు.