స్థానిక ఎన్నికల నిర్వహణపై సమీక్ష: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఈసీ స్పష్టం

రిపోర్టర్: సునీల్ స్థలం: Vijayawada

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా మారిన ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజయవాడలో కలెక్టర్లతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్నికలను పూర్తిగా స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రెండు కోట్ల అరవై ఒక లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారి కోసం ముప్ పై వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.