మలయాళ స్టార్ మోహన్ లాల్పై మనసుపారేసుకున్నానని వెల్లడించిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
మలయాళ నటుడు మోహన్ లాల్పై తనకు ప్రత్యేకమైన క్రష్ ఉందని ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, మోహన్ లాల్ సినిమాలు చూస్తూ తాను పెరిగానని తెలిపారు. తన కుటుంబంలో అమ్మతో పాటు తమ్ముడు కూడా ఆయనకు వీరాభిమానులని ఆమె పేర్కొన్నారు. తమ మధ్య వయసులో తేడా ఉన్నప్పటికీ ఆయనపై తనకు ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని అనుపమ స్పష్టం చేశారు.