ద్విచక్ర వాహన ప్రియులకు గుడ్ న్యూస్: కొత్త బైక్ ల ప్రదర్శన
రిపోర్టర్: రాజేష్
స్థలం: మిలాన్
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మిలాన్ లో జరిగిన ఈఐసీఎంఏ వేదికగా పలు నూతన మోటార్ సైకిళ్లను ప్రదర్శించింది అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. హిమాలయన్ 750, కాంటినెంటల్ జీటీ 750 మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ స్క్రంబ్లర్ ను ఆవిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఈ సరికొత్త వాహనాలు శక్తివంతమైన ఇంజిన్లతో పాటు అతధునిక ఫీచర్లతో వస్తున్నాయని, త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు స్పష్టం చేశారు.