జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం ఎనిమిది లగ్జరీ కార్లు దగ్ధం

రిపోర్టర్: కిరణ్ స్థలం: జైపూర్

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ మార్కెట్‌లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ కార్ల వర్క్‌షాప్‌లో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో సుమారు ఎనిమిది లగ్జరీ కార్లు, విలువైన విడిభాగాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైరింజన్లతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.