ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో చంద్రబాబు కీలక మైలురాళ్లు

రిపోర్టర్: సతీష్ స్థలం: Andhra Pradesh

పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ఏపీ సాగునీటి రంగంలో చంద్రబాబు నాయుడు కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని రైతులకు సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నాయి. 'వాటర్ మ్యాన్'గా తన ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించారు.