గోదావరి ఇసుక దందా: ఉలిక్కిపడుతున్న మంగపేట ప్రాంత ప్రజలు
రిపోర్టర్: సునీల్
స్థలం: మంగపేట
మంగపేట మండలంతో పాటు ఐదు మండలాల్లో గోదావరి ఇసుక రవాణా స్థానికులకు శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక లారీల రాకపోకలతో రోడ్లు ధ్వంసమై వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు వాపోయారు. అధికారుల మద్దతుతోనే ఈ అక్రమ రవాణా కొనసాగుతోందని, ఇటీవల పోలీస్ జవాన్ మృతి చెందిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని స్థానికులు పేర్కొన్నారు.