అమెరికా ఎన్నికల ఓటమిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: వాషింగ్టన్
అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీ ఓటమికి గల కారణాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. తాను పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన పెట్రోల్ ధరలు, మీడియా వ్యవహారశైలే తమ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయని ట్రంప్ విశ్లేషించినట్లు తెలిపారు. ఈ ఓటమిని ఆయన తన వ్యక్తిగత ఇమేజ్ కు ఆపాదించకుండా కేవలం ఇతర అంశాలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.