ఐఐటీ బొంబాయి విద్యార్థి మృతి ఘటనలో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లపై ఆరోపణలను ఖండించిన అధ్యాపకులు

రిపోర్టర్: మహేష్ స్థలం: ముంబై

ఐఐటీ బొంబాయిలో ఇంజనీరింగ్ విద్యార్థి సా వాకోడే మృతి అనంతరం ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లపై వస్తున్న ఆరోపణలను ఫ్యాకల్టీ ఫోరం అధ్యక్షుడు ప్రొఫెసర్ రాజ్‌కుమార్ పంత్ తీవ్రంగా ఖండించారు. సాహిిల్ మరణానికి ముందు గత మూడు నాలుగు నెలల్లో ఎస్సీ ఎస్టీ సెల్‌ను ఆశ్రయించిన దాఖలాలు లేవని, నిబంధనల ప్రకారమే దూళ్ల విధులు నిర్వర్తించారని ఆయన స్పష్టం చేశారు.