అమెరికా రాజకీయాల్లో వివేక్ రామస్వామికి ఎదురుదెబ్బ: కులం, మతంపై తీవ్ర చర్చ
రిపోర్టర్: రాము
స్థలం: అమెరికా
అమెరికాలో రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న బిలియనీర్ వివేక్ రామస్వామికి భారతీయ మూలాలు, హిందూ మతం అడ్డంకులుగా మారుతున్నాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఒహాయో గవర్నర్ ఎన్నికల ప్రచారంలో ఆయనకు జాతి, మతం సెగ తగులుతోందని వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. ప్రైమరీలో ఘన విజయం సాధించినప్పటికీ, సాధారణ ఎన్నికల్లో కొందరు ఓటర్ల నుంచి మతపరమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఇది అమెరికాలో పెరుగుతున్న అసహనానికి సంకేతంగా మారుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.