స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఘన విజయం సాధించిన రత్నమ్మ

రిపోర్టర్: మహేష్ స్థలం: Gudur

గూడూరు ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల్ లో అభివృద్ధి పనుల కారణంగానే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మండ్ల రత్నమ్మ ఘన విజయం సాధించినట్లు స్థానిక ఓటర్లు తెలిపారు. గతంలో తెదేపా తరఫున గెలిచిన ఆమె, నిధుల లేమిని లెక్కచేయకుండా తన భర్త సహకారంతో సొంత నిధులతో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాదకర బావి పూడ్చివేత, తాగునీటి వసతి కల్పన వంటి పనులతో ప్రజల మన్ననలు పొంది, ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి సత్తా చాటారు.