వితంతు పింఛను బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు: దరఖాస్తు చేసిన నాటి నుంచే చెల్లించాలి
రిపోర్టర్: గోపి
స్థలం: గుంటూరు
అధికారుల జాప్యం కారణంగా వితంతు పింఛను దరఖాస్తు పెండింగ్లో ఉంటే ఆ కాలానికి బకాయిలు చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన తిరుపతమ్మ దాఖలు చేసిన వ్యాజ్యంలో జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి ఈ మేరకు కీలక తీర్పు వెలువరించారు. దరఖాస్తును ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. కోర్టు ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా బకాయిలు చెల్లించాలని స్పష్టం చేశారు.