పరిశ్రమలే ఇక శిక్షణ కేంద్రాలు: ఏపీలో కొత్త నైపుణ్య విధానం
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీలో పారిశ్రామిక నైపుణ్యాల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం కొత్త విధానం తెచ్చింది. పరిశ్రమలే స్వయంగా శిక్షణనిచ్చి, ఎన్సీవీఈటీ సహకారంతో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని 49 పరిశ్రమలు ఇప్పటికే దీనికి సిద్ధమయ్యాయి. ఈ ధృవీకరణ పత్రాలు 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా అర్హతలతో సమానమైన గుర్తింపును కలిగి ఉంటాయి.