నకిలీ వైద్య ధృవపత్రాలతో విరాళాలు సేకరించిన యువకుడు అరెస్ట్

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆగ్రా

చెల్లెలికి కంటి చూపు లేదంటూ సామాజిక మాధ్యమాలలో నకిలీ వైద్య ధృవపత్రాలు సృష్టించి సుమారు లక్షన్నర రూపాయలు విరాళాలు సేకరించిన అజయ్వీర్ సింగ్ను ఆగ్రా పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ దగాపై స్పందించిన ష్రాఫ్ ఐ సెంటర్ ఆసుపత్రి యాజమాన్యం తమ లెటర్ హెడ్లను అడ్డంపెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు హెచ్చరించింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు.