ఢిల్లీలో భారీ నకిలీ కాల్ సెంటర్లు గుట్టు రట్టు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ పశ్చిమ జిల్లాలో పోలీసులు సంచలన దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఏకంగా మూడు నకిలీ కాల్ సెంటర్లను భగ్నం చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలకు సంబంధించి మొత్తం 23 మందిని అరెస్ట్ చేసినట్లు పశ్చిమ డీసీపీ వీ. హరేశ్వర్ స్వామి తెలిపారు. నిందితులు ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లా ఈ మోసాలను సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.