ఉద్యోగులకు పీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపు

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించనుందని అధికారులు వెల్లడించారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ కొత్త నిబంధన త్వరలోనే అమల్లోకి రానుందని అధికారులు స్పష్టం చేశారు. దీని ద్వారా ఉద్యోగుల నెలవారీ కాంట్రిబ్యూషన్ మారనుండగా, కొత్తగా లక్షలాది మందికి పీఎఫ్ భద్రత లభించనుంది.