అనంతపురం జిల్లాలో ఘనంగా శ్రీబాంతి చన్నమ్మ జాతర
రిపోర్టర్: సురేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలో శ్రీబాంతి చన్నమ్మ అమ్మవారి ఏడ జాతర మంగళవారం ఘనంగా జరిగింది. గంగినీటి ఊరేగింపుతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతానం ప్రసాదించే తల్లిగా కొలిచే ఈ అమ్మవారి జాతరకు భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.