ఐరోపా దేశాలకు రష్యా నుంచి ఎలాంటి ముప్పు లేదు: పుతిన్
రిపోర్టర్: హరి
స్థలం: World
ఐరోపా దేశాలకు రష్యా నుంచి ఎలాంటి ప్రమాదం లేదని, గతంలోనూ అటువంటి ముప్పు ఎప్పుడూ లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. యూరోపియన్ దేశాలను బెదిరించడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఐరోపాలో ప్రస్తుత సంక్షోభాలకు పాశ్చాత్య దేశాల విధానాలే కారణమని ఆయన ఘాటుగా విమర్శించారు.