వైద్య చరిత్రలో అరుదైన ఘట్టం: పక్షికి అమర్చిన త్రీడీ ప్రింటెడ్ కృత్రిమ ముక్కు

రిపోర్టర్: సునీల్ స్థలం: ఆమ్‍స్టర్డామ్

నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ ఆర్టిస్ జూ వైద్యులు ప్రపంచంలోనే తొలిసారిగా గాయపడిన ఒక అరుదైన పక్షికి నూతన జీవం పోశారు. రెండు భాగాలు విరిగిపోయిన హార్న్బిల్ పక్షి ముక్కు స్థానంలో, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి త్రీడీ ప్రింటెడ్ కృత్రిమ ముక్కును విజయవంతంగా అమర్చినట్లు వెటర్నరీ వైద్య నిపుణులు తెలిపారు. ఈ శస్త్రచికిత్స అత్యంత విజయవంతమైందని, ఆపరేషన్ జరిగిన రోజే పక్షి తన కొత్త ముక్కును సాధారణంగా ఉపయోగించడం ప్రారంభించిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.