మఠంలో దారుణం: బాలికల అశ్లీల వీడియోలు తీసి విక్రయించిన పూజారికి జీవిత ఖైదు

రిపోర్టర్: నరేష్ స్థలం: Mathura

దేవాలయానికి వచ్చే బాలికల రహస్య అశ్లీల వీడియోలు రికార్డు చేసి విదేశాలకు విక్రయించిన శ్యామ్ బిహారీ అనే పూజారికి మథుర కోర్టు జీవిత ఖైదు విధించిందని ప్రభుత్వ న్యాయవాది రాంపాల్ సింగ్ తెలిపారు. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ రంగంలోకి దిగి దర్యాప్తు పూర్తి చేసిందని, నిందితుడికి కోర్టు భారీ జరిమానా కూడా విధించిందని అధికారులు వెల్లడించారు.