సహకార రంగంలో పారదర్శకత సాధనకు పెల్లుబికిన ప్రజాస్వామ్య నినాదం

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకవర్గాలకు వెంటనే ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని సహకార సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగానికి మెరుగైన సేవలందించేందుకు నూతన పాలకవర్గ భవనాలు నిర్మించడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చైర్మన్లను ఎన్నుకోవడం ద్వారా సహకార వ్యవస్థ బలోపేతమవుతుందని, రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆయన విజ్ఞప్తి చేయడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో పాలకవర్గ డైరెక్టర్లు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.