విజయనగరం రాజకీయం: ఒకే కుటుంబంలో భిన్న పార్టీల భార్యాభర్తలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజిత చిన్న శ్రీను, ఆయన కుమార్తె సిరిసహస్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే సిరిసహస్ర భర్త ప్రదీప్ మాత్రం వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతున్నారు. ప్రదీప్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు వైఎస్సార్‌సీపీ నేత కావడంతో కుటుంబంలో భిన్నమైన రాజకీయ బాటలు ఏర్పడ్డాయి. ఒకే ఇంట్లో భార్యాభర్తలు రెండు ప్రత్యర్థి పార్టీల్లో ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది.