అమరావతిని గ్లోబల్ హెల్త్ హబ్ గా మారుస్తామన్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: అమరావతి

అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐదు సూత్రాలతో అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి భూమిపూజ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రపంచమంతా హెల్త్ కేర్ కోసం అమరావతికి వచ్చే రోజులు వస్తాయని, రాబోయే రోజుల్లో అమరావతి పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని ధీమా వ్యక్తం చేశారు.